సచివాలయం ముందు పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూలగొడతామని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హన్మంతరావు తీవ్రంగా ఖండించారు. ఒకవేళ రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
దేశాన్ని 21 వ శతాబ్దానికి తీసుకొని పోవటానికి కృషి చేసిన వ్యక్తి రాజీవ్ అనీ, అలాంటి నేత విగ్రహంకూలగొడతాం అని అనటం సరికాదన్నారు వీహెచ్. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పరిస్థితేమిటని బీఆర్ఎస్ నేతలను విహెచ్ ప్రశ్నించారు.