Mahabubabad : చెరువు కట్ట డెవలప్ చేయాలని గ్రామస్తుల ధర్నా

Update: 2025-04-07 12:15 GMT

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ఆలేరు స్టేజ్ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో తెగిపోయిన చెరువుకట్ట మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలంటూ రోడ్డుపై రైతులు బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. వర్షా కాలంలో గండి పడిన చెరువుకు ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు. తక్షణమే అధికారులు స్పందించి ఊరు చెరువును బాగు చేయాలని రైతుల డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News