విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం వెనక్కి తగ్గడం బీఆర్ఎస్ విజయమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇక బీఆర్ఎస్ బిడ్డింగ్‌లో పాల్గొంటుందనే ఉద్దేశంతోనే కేంద్రం వెనకడుగు వేసిందన్నారు. అయితే స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయం పూర్తి స్థాయిదిగా భావించడం లేదన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి... ఏపీ మంత్రులు జాగ్రత్తగా మాట్లాడకపోతే అందరి చిట్టాలు విప్పుతామని హెచ్చరించారు. ఇక సుఖేష్ అంశం బీజేపీ నాటకమని జగదీష్ రెడ్డి అన్నారు.