Huzurabad By Election : ఓటర్లను ప్రభావితం చేయనున్న రెండు అంశాలు...!

Huzurabad By Election : హుజురాబాద్‌‌లో ఓటర్ల తీర్పు ఇప్పుడు రెండు కీలక అంశాలను ప్రభావితం చేయనున్నాయి. ఒకటి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ట్రెండ్, రెండోది దళిత బంధు పథకం అమలు.;

Update: 2021-10-27 09:04 GMT

Huzurabad By Election : హుజురాబాద్‌‌లో ఓటర్ల తీర్పు ఇప్పుడు రెండు కీలక అంశాలను ప్రభావితం చేయనున్నాయి. ఒకటి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ట్రెండ్, రెండోది దళిత బంధు పథకం అమలు.. ఈ రెండు ఇప్పుడు హుజురాబాద్ ప్రజల తీర్పు పైన ఆధారపడి ఉంది. కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీగా క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌‌కు పంపింది. గవర్నర్ గత రెండు నెలలుగా దీనిని పెండింగ్లో ఉంచారు. సోషల్ సర్వీస్ ఏమి చేశారని దానిపైన వివరాలను గవర్నర్ సేకరించినట్టుగా సమాచారం.

ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న కౌశిక్ రెడ్డి .. ఒకవేళ టి.ఆర్.ఎస్ తనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటనేది సన్నిహితుల వద్ద చర్చించినట్టు సమాచారం. ఇక దళిత బంధువిషయానికి వస్తే ముందుగా రెండు వేల కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఎన్నికల కోడ్ నేపధ్యంలో ఎలక్షన్ కమిషన్ దీనికి బ్రేక్ వేయడం జరిగింది.

ఒకవేళ ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడితే దళిత బంద్ పధకం అమలు పై సస్పెన్స్ నెలకొంది. అయితే తాజాగా జరిగిన టీఅరఎస్ ప్లీనరీ  మీటింగ్ లో దళితబంధు నవంబర్ 4 నుంచి కొనసాగుతుందని కేసీఆర్ వెల్లడించారు. 

Tags:    

Similar News