Jainoor : జైనూర్ వీడియోలు షేర్ చేస్తే అంతే.. పోలీసుల వార్నింగ్

Update: 2024-09-06 11:30 GMT

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీసు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. జైనూర్లో ప్రశాంతతను నెలకొల్పేందుకు, స్థానికులలో మనోధైర్యం కలిగించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అత్యంత సున్నితమైన ఈ అంశంపై వివిధ సామాజికవర్గాలను రెచ్చగొట్టే విధంగా ఎలాంటి సామాజిక, రాజకీయ ప్రకటనలు చేయరాదని హెచ్చరించింది. సోషల్ మీడియాలో అనధికారిక సమాచారం, ఊహాగానాలు, మీడియాలో రెచ్చగొట్టే తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినట్టయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.

జైనూర్లో తిరిగి శాంతిభద్రతలను నెలకొల్పేందుకు ప్రజలు, స్వచ్చంద సంస్థలు, అన్ని వర్గాల వారు పోలీస్ శాఖకు తోడ్పాటు అందించాలని కోరింది. కాగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ పట్టణంలో బుధవారం హింసాత్మక ఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఓ ఆటో డ్రైవర్ అక్కడి గిరిజన మహిళపై లైంగిక దాడి చేశాడనే నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జైనూర్ పట్టణంలో ఇంటర్నెట్ నిషేధం కూడా విధించారు. అదేవిధంగా వాట్సప్ గ్రూపులలో ఫేక్ వార్తలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీస్ లు ఉద్రికత్తల వాతావరణంపై ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి కొమురంభీమ్ జిల్లా జైనూర్ లో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉందని పోలీసుశాఖ వివరించింది.

Tags:    

Similar News