HYDRA : హైడ్రా కూల్చివేతలకు మేం వ్యతిరేకం.. అక్బరుద్దీన్ సీరియస్

Update: 2024-10-24 07:15 GMT

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ - హైడ్రా పనితీరు పేదలను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కల్చి, డబుల్‌ బెడ్‌ రూం ఇస్తే ఎలా ఒప్పుకుంటారన్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అధికారం వుందికాదని అభివృద్ధి పేరుతో పేదల ఇళ్ళు కూల్చడం సరికాదన్నారు. అందుకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు అక్బరుద్దీన్ ఒవైసీ. 

Tags:    

Similar News