CM Revanth : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం

Update: 2025-08-15 12:30 GMT

హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శనలు, కోలాట నృత్యాలు, డబ్బు చప్పుళ్లు ప్రధాక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర గవర్నర్, అధికారులు, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ...అందరికి 79వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందేలా కృషి చేస్తున్నామని... తెలంగాణలో సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి సీఎం వివరించారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ, గృహజ్యోతి పథకం వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి యువత సాధికారత కాకుండా.. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ లాంటి గొప్ప కార్యక్రమాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

Tags:    

Similar News