Vikarabad Bus Crashes : లారీని ఢీకొట్టిన పెళ్లి బస్సు.. నలుగురు మృతి

Update: 2025-05-20 09:30 GMT

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పరిగి మండలం రంగాపూర్‌ సమీపాన బీజాపూర్‌-హైదరాబాద్‌ నేషనల్‌ హై వే పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన వారు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన ఫంక్షన్‌ కు హాజరయ్యారు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న లారీని … వారు ప్రయాణిస్తున్న బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా చనిపోయారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

Tags:    

Similar News