Road Accident : పెళ్లింట విషాదం..వరుడికి తీవ్ర గాయాలు.. ఆగిన పెండ్లి

Update: 2025-06-05 13:30 GMT

తెల్లవారితే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పెండ్లి.. వరుడుతో సహా బంధువులంతా నిన్న రాత్రి నాందేడ్ నుండి హుజురాబాద్ కు కారులో బయలు దేరారు. ఇవాళ తెల్లవారు జామున జగిత్యాల జిల్లా కొండగట్టు వరకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మూడు నెలల బాలుడు రుద్ర (3) మృతి చెందగా.. పెండ్లికొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మల్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం లో వరుడు తీవ్రంగా గాయపడటం అదే కుటుంబానికి చెందిన బాలుడు మృతి చెందటంతో పెళ్లింట విషాదం నెలకొంది. అనుకోని సంఘటన జరిగి పెండ్లి కొడుకు గాయపడటంతో పెండ్లి ఆగిపోయింది. గాయపడినవారు చికిత్స అనంతరం వారంతా తిరిగి నాందేడ్ వెళ్లిపోయారు.

Tags:    

Similar News