KTR : 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి? : కేటీఆర్

Update: 2024-11-26 13:30 GMT

అదానీకి తాము రెడ్ సిగ్నల్ చూపిస్తే రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్ వేసిందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ తిడితేనే ఇప్పుడు సీఎం వంద కోట్లు వద్దన్నాడని అన్నారు. కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదని.. 12,400 కోట్లు ఒప్పందాల సంగతేంటి? అని ప్రశ్నించారు. రాహుల్, రేవంత్రెడ్డిలలో ఎవరు పిచ్చోళ్లో వాళ్లే తేల్చుకోవాలన్నారు. తెలంగాణభవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ‘అబద్ధాల రేవంత్ రెడ్డి.. నేను సైకో అయితే.. నువ్వు శాడిస్ట్ బ్యాగులు మోసిన గజ దొంగవ్. నిన్నటి కామెంట్స్ చూస్తే ఆయనకు చిప్దొబ్బిందని అర్థమవు తోంది. మీ లెక్క చీకట్లో కాలు మొక్కే బాపతి కాదు మేం. మేం అదానీని బహిరంగంగానే కలిశాం. జాతీయ రహదారులు, రక్షణ శాఖ, సెంట్రల్ గ్రిడ్ కేంద్రంలో ఆధ్వర్యంలో జరుగు తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమో అర్థం కావడం లేదు. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టు ను అదానీ డేటా సెంటర్ అని రేవంత్ అనడం హాస్యాస్పదం. అదానీ అక్టోబర్ లో 100 కోట్ల చెక్ ఇచ్చిండు. ఇందులో నీ ఇంటేషన్ లేకపోతే ఎందుకు దాన్ని పక్కకు పెట్టినవ్. ఏడాదిగా అదానీ, అల్లుడు, అన్న, బామ్మర్దికి అమృతం పంచటం కోసమే పనిచేస్తున్నాడు.

Tags:    

Similar News