ఆ విషయం రుజువు చేస్తే నిమిషంలో రాజీనామా చేస్తా : సీఎం కేసీఆర్
బీజేపీ తీరుపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం.. తరువాత బీజేపీ తీరును తప్పు పట్టారు. పెన్షన్ల విషయంలో..;
బీజేపీ తీరుపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం.. తరువాత బీజేపీ తీరును తప్పు పట్టారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తుందని చెప్పుకుంటున్నారని.. ఒక వేళ దాన్ని ఎవరైనా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతాను అంటూ సవాల్ విసిరారు.