Women's Commission : కావూరిహిల్స్ శ్రీచైతన్య కాలేజీపై మహిళా కమిషన్ సీరియస్

Update: 2025-06-11 07:30 GMT

కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీల పట్ల తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు వరుసగా చేస్తున్న ఫిర్యాదులపై కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద స్పందించారు. ఈ మేరకు ఆకస్మిక కావూరి హిల్స్ మాదాపూర్ శ్రీచైతన్య జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరాతీశారు. పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అక్కడి విద్యార్థినీలతో మాట్లాడారు. ప్రధానంగా కాలేజీలో విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని,బాత్రూమ్లు, మంచినీటి వసతి, తనిఖీ చేశారు. అత్యంత దుర్భరంగా ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా గుర్తించి యాజమాన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాడైపోయిన భోజనం: మొదటగా విద్యార్థినీలకు వడ్డించే ఆహారాన్ని పరీశీలించారు. పాడైపోయిన పప్పును వడ్డిస్తూ విద్యార్ధుల అనారోగ్యానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారంలో నాణ్యత లేదని, వాసన వస్తోందని, ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News