చేనేత వస్త్రాల తయారీపై అవగాహన కార్యక్రమాలకు మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ చెప్పారు. బుధవారం పోచంపల్లిలోని హ్యాండ్లూమ్ పార్క్ ను రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. తెలంగాణలో పోచంపల్లి అనేది చేనేతకు పేరుగాంచినదని, మే 15న జరగబోయే మిస్ వరల్డ్ అవగాహన కార్యక్రమం ద్వారా ఇంటర్నేషనల్ ఆడియన్స్, ఇండియన్ ఆడియన్స్ కు చెప్పే విధంగా ప్రమోట్ చేస్తారని అన్నారు స్మితా సబర్వాల్. మిస్ వరల్డ్ పర్యటనలో భాగంగా పార్కు రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ముఖ్యమైన ప్రదేశాల్లో పర్యటిస్తారని తెలిపారు. పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.