Yadagiri Gutta: యాదగిరీశుడికి యువరాణి కానుక....
స్వామి వారికి రూ .5 లక్షలు విలువచేసే ఆభరణాలు కానుకగా ఇచ్చిన యువరాణి ఎస్రా;
ఆఖరి నిజాం రాజకుమారుడు ముఖరంఝా సహధర్మచారిణి ప్రిన్సెస్ ఎస్రా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భారీ కనుక సమర్పించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని రూ.5 లక్షల విలువ చేసే బంగారు నగలను స్వామి వారికి అందజేశారు. ఆలయ అభివృద్ధి శాఖ ఉపాధ్యాక్షుడు జి. కిషన్ రావు యువరాణి తరఫున అభరణాలను ఆలయ ఎక్సిక్యూటీవ్ ఆఫీసర్ ఎన్.గీతకు అందజేశారు. ప్రస్తుతం లండన్ లో నివాసముంటోన్న యువరాణి ఇటు హైదరాబాద్ కు, అటు తమ స్వదేశమైన టర్కీకి క్రమం తప్పకుండా వెళుతుంటారని కిషన్ రావు తెలిపారు. అయితే యువరాణి చాలాకాలంగా యాదాద్రీశుడిని దర్శించుకోవాలిని ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. ఇటీవలే హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె గుడికి రావాలనుకున్నారని, ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారని, అయితే ముఖరంఝా మరణంతో వీలుపడలేదని తెలిపారు. అసఫ్ జాహీ పరిపాలనలో హైదరాబాద్ ఆఖరి నిజాం రాజు మీర్ ఒస్మాన్ అలీఖాన్ కూడా ఆలయానికి రూ. 82825లను డొనేట్ చేశారు.