అమ్మాయి ప్రేమ నిరాకరించిందని ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టీఎస్‌ఐఐసీ కాలనీకి చెందిన ఎం.రాజశేఖర్ (31) జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నాడు.ఇతడు ఓ అమ్మాయిని ప్రేమించమంటూ వెంటపడుతూ ఉండడంతో ఆమె అందుకు నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు