Karimnagar District : మద్యం మత్తులో పురుగుల మందు.. యువకుడు మరణం..

Update: 2025-07-14 12:15 GMT

కరీంనగర్ జిల్లా కోటపల్లిలో విషాదం నెలకొంది. బొమ్మన సంపత్ మద్యం మత్తులో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి మద్యం సేవించిన తర్వాత మైకంలో ఆయన పురుగుల మందు సేవించినట్లు పోలీసులు తెలిపారు. సంపత్‌ను గమనించిన కుటుంబ సభ్యులు తొలుత చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి.. ఆ తర్వాత కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కొన్నాళ్ల క్రితమే పెళ్లైంది.

Tags:    

Similar News