TS : యువతిని చెరబట్టిన యూత్ కాంగ్రెస్ నాయకుడు..సస్పెండ్

Update: 2024-05-31 10:17 GMT

కామారెడ్డి జిల్లాలో ఒక యువజన నాయకుడు దారుణ ఘటనకు ఒడిగట్టాడు.మహిళపై కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంద్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సదరు మహిళ ప్రతిఘటించడంతో చుట్టుపక్కల వారు పట్టుకొని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంద్ ను చితకబాది పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు గ్రామస్తులు తెలిపారు.

రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఆనంద్ పై బాధిత మహిళ ఫిర్యాదు చేశారు.యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పై కేసు నమోదు కావడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది.యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంద్ ను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రకటన విడుదల చేశారు.

Tags:    

Similar News