పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా తాజా సమాచారం ప్రకారం విడుదల తేదీని జూలై 4 లేదా జూలై 11కి మార్చే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు కొత్త పోస్టర్‌తో అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
17వ శతాబ్దపు మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ తొలి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే ధీరోదాత్త యోధుడి పాత్రలో కనిపించనున్నారు ఆయన మొగల్ సామ్రాజ్యం నుంచి ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే లక్ష్యంతో సాహసోపేతమైన యాత్రను సాగిస్తారు చిత్రంలో బాబీ దేఓల్ మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్‌గా విలన్ పాత్రలో నటిస్తుండగా నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనున్నారు నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
క్రిష్ జగర్లమూడి రచన ఆరంభ దశలో దర్శకత్వంతో పాటు, ఏఎం జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా గ్నాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ, బెన్ లాక్ వీఎఫ్ఎక్స్ సమకూర్చారు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పిస్తున్నారు.
ఈ చిత్రం గతంలో అనేకసార్లు వాయిదా పడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు కోవిడ్ ఇతర సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడినప్పటికీ తాజాగా మే 2025లో చిత్రీకరణ పూర్తయినట్లు పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయినప్పటికీ సరైన విడుదల కోసం మరింత సమయం కావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ చిత్ర నిర్మాతలకు 11 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించినట్లు తెలుస్తోంది. చిత్ర షూటింగ్ ఆలస్యం వాయిదాల కారణంగా నిర్మాతలకు ఆర్థిక ఒత్తిడి ఏర్పడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన పారితోషికంలో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చినట్లు సమాచారంఈ నిర్ణయం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
జూలై 4 లేదా 11న కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా విడుదలయ్యే కొత్త పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయనుందని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నేపథ్యంలో కొత్త విడుదల తేదీ ప్రకటనతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.