Kurnool Bus Fire : కర్నూలు బస్ దుర్ఘటనపై హోమ్ మంత్రి అనిత

Update: 2025-10-24 10:38 GMT

కర్నూలు జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మందిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పెద్దవాళ్ళు 15 మంది, చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు. 9 మంది గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ దురదృష్టకర ఘటనపై స్పందిస్తూ హోమ్ మంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. "చాలా దురదృష్టకర ఘటన జరిగింది. మాకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాము. మా లోకల్ ప్రతినిధులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు సహాయ పడ్డారు" అని తెలిపారు.

ప్రమాద తీవ్రత కారణంగా గుర్తుపట్టడానికి వీలు లేకుండా మృతదేహాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను గుర్తించేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుటుంబాలకు మృతదేహాలు అందించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ పోలీస్ అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. "ఘటన జరిగాక చాలా కోణాలు ఉంటాయి. 16 టీమ్లు ఏర్పాటు చేశాం. అందరికీ పై చర్యలు తీసుకుంటాం. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాము" అని మంత్రులు పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబుకు అన్ని రిపోర్టులు అందిస్తామని, ట్రాన్స్పోర్ట్ మరియు రెవెన్యూ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షలు ప్రభుత్వం తరుపున అందిస్తామని ప్రకటించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 6 మంది ఉన్నట్లు తెలిసింది,చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.

Tags:    

Similar News