Jharkhand: 12 ఏళ్లకే రిపోర్టర్‌గా మారిన బాలుడు.. స్కూల్ సమస్యలపై రిపోర్టింగ్..
Jharkhand: ఒక్కొక్కసారి తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసే కొన్ని విషయాలు, మాట్లాడే మాటలు ఇతరులను ఆలోచింపేలా చేస్తాయి.;
Jharkhand: ఒక సమస్య గురించి నోరువిప్ప మాట్లాడాలంటే వయసులతో సంబంధం లేదు. ఒక ప్రాబ్లమ్‌ను రిపోర్ట్ చేయాలంటే రిపోర్టింగ్ నేర్చుకోవాల్సిన పనిలేదు. అలాగే అనుకున్నాడేమో ఝార్ఖండ్‌కు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు. అంత చిన్న వయసులో అతడి మెదడుకు ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ తన స్కూల్ సమస్యలపై రిపోర్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఒక్కొక్కసారి తెలిసి తెలియని వయసులో చిన్న పిల్లలు చేసే కొన్ని విషయాలు, మాట్లాడే మాటలు ఇతరులను ఆలోచింపేలా చేస్తాయి. అలాగే ఝార్ఖండ్‌లోని గోడ్డా జిల్లాలోని స్కూల్‌లో చదువుతున్న సర్ఫరాజ్ ఖాన్ చేసిన పని కూడా అలాంటిదే. ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్‌ను మైక్‌గా ఉపయోగిస్తూ.. తన స్కూల్ అంతా తిరుగుతూ అక్కడి సమస్యలను చెప్పుకొచ్చాడు ఈ బాలుడు.
సర్ఫరాజ్ ఈ వీడియో చేయడానికి తన స్నేహితులు కూడా కొందరు సహాయపడినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఝార్ఖండ్ ప్రభుత్వం సైతం దీనిపై స్పందించింది. దీంతో ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. తాగడానికి నీరు సౌకర్యం లేదన్న దగ్గర నుండి పాఠశాలలో కనీస వసతులు లేవు.. లాంటి ఎన్నో విషయాలను సర్ఫరాజ్ ఈ వీడియోలో ప్రస్తావించాడు.
नीयत सही हो तो बिना माइक थामे भी रिपोर्टिंग कर सच्चाई दिखाई जा सकती है. pic.twitter.com/rpuYVqXLqC
— Utkarsh Singh (@UtkarshSingh_) August 4, 2022