Kovid Kapoor: 'నా పేరు కోవిడ్.. కానీ నేను వైరస్‌ను కాదు'
Kovid Kapoor: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అన్నట్టుగా పేర్లను పోలిన పేర్లు కూడా ఉంటాయిగా.;
Kovid Kapoor (tv5news.in)
Kovid Kapoor: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అన్నట్టుగా పేర్లను పోలిన పేర్లు కూడా ఉంటాయిగా. మనం రోజూ తరచుగా వినే పేర్లు కాకుండా కాస్త డిఫరెంట్ పేర్లు వింటే మనమే కాసేపు కన్ఫ్యూషన్‌లో పడతాం.. దాని అర్థం ఏమయ్యింటుందా అని. మనకు చాలా సన్నిహితమైన పదమే ఒకరి పేరుగా ఉంటే.. అది ఎలా ఉంటుందో కోవిడ్ కపూర్‌కు మాత్రమే తెలుసు. నిజమే.. కోవిడ్ పేరుతో ఓ మనిషి ఉన్నాడు.
రెండు సంవత్సరాలకు పైగా అస్సలు హోమ్ క్వారంటీన్ అంటే ఏంటో, ఒక వైరస్ ఎన్ని విధ్వంసాలను సృష్టించగలదో మనకు చూపిస్తూ వస్తోంది కరోనా. దానికి వైద్య నిపుణులు పెట్టిన మరో పేరే కోవిడ్. అంటే కరోనా వైరస్ డిసీస్. రెండేళ్లుగా కోవిడ్ అనేది అందరి జీవితాల్లో ఓ భాగమయిపోయింది. దాని వల్ల దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగానే ఎంతోమంది మృత్యువాత పడ్డారు.
అయితే కోవిడ్ అనే పేరుతో ఓ మనిషి ఉన్నాడు. అది కూడా మన భారతదేశానికి చెందిన వాడే. అతడు ఓ టూరిస్ట్ కంపెనీకి యజమాని. కరోనా అనేది మనుషులకు పరిచయమయిన తర్వాత కోవిడ్ కపూర్.. తన ట్విటర్ ద్వారా 'నా పేరు కోవిడ్.. కానీ నేను వైరస్‌ను కాదు' అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ విపరీతంగా వైరల్‌గా మారింది. చాలామంది అతడి పేరును చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు.
My name is Kovid and I'm not a virus 🙄#COVID2019 #coronavirusus
— Kovid Kapoor (@kovidkapoor) February 12, 2020
కరోనా తర్వాత అతడు ఏ ఫారిన్ ట్రిప్‌కు వెళ్లినా.. అక్కడి వారు తన పేరును చూసి నవ్వుకుంటున్నారని చెప్పుకొచ్చాడు కోవిడ్ కపూర్. బెంగుళూరుకు చెందిన కోవిడ్.. ఈ మహమ్మారి వల్ల తన బిజినెస్ దెబ్బతిందని.. కానీ తన పేరుతో అందరు వేసే జోకులే తనను ప్రోత్సహిస్తు్న్నాయని అన్నాడు. ఇటీవల కోవిడ్.. తన 30వ పుట్టినరోజును జరుపుకున్నాడు. తన ఫ్రెండ్స్ అందరూ సరదాగా తన బర్త్‌డే కేక్‌పై హ్యాపీ బర్త్‌డే కోవిడ్ 30 అని రాయించిన ఫోటోను తన ట్విటర్‌లో షేర్ చేశాడు కోవిడ్ కపూర్.
For my 30th bday, my friends ordered a cake - and Amintiri automatically assumed that it's some kinda joke, and it should be spelled with a C not a K. 🎂 pic.twitter.com/3jrySteSbC
— Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022