గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వివాదాస్పద అఘోరిగా పేరు తెచ్చుకున్న అఘోరి మాత అలియాస్ శ్రీనివాస్ శనివారం రాత్రి చివ్వెంల మండలం వల్ల భపురం, ఉండ్రుగొండ గ్రామాలలో హల్ చల్ చేసింది. శనివారం రాత్రి వల్లభాపురం జాతీయ రహదారి పక్కన చెరువు పక్కన గల ఆలయాల వద్ద అఘోరి తన కారును నిలపగా అక్కడ కొందరు వీడియోలు తీసే క్రమంలో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం నేపథ్యంలో అఘోరి అక్కడే రెండు గంటలసేపు తిష్ట వేసి హంగామా చేసింది. తనని గుర్తుతెలియని వ్యక్తులు కొందరు పట్టుకున్నారని.. వారు తనకు క్షమాపణ చెప్పాలని రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేయగా స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అఘోరి తన కారులో ఉన్న తల్వార్తో ఉండ్రుగొండ గ్రామంలో ప్రవేశించి తనను నిలువరించేందుకు ప్రయత్నించిన గ్రామస్తులపై దాడికి యత్నించి అఘోరిగా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను అవమానపరు దూషించినట్లు పలువురు తెలిపారు. రాత్రి మొత్తం అఘోరి ఉండ్రుగొండ, వల్లభాపురం గ్రామాల ప్రజలు భయం భయంగా గడిపిన పేర్కొంటున్నారు. ఆదివారం ఉదయం వల్లభాపురం వద్ద విజయవాడం హైదరాబాద్ జాతీయ రహదారిపై తన కారును అడ్డంగా పెట్టి సుమారు గంటసేపు పైగా రభస చేసింది. సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్దీకరించగా సమీపంలోని హోటల్ వద్దకు వెళ్లి అక్కడ కొందరిపై దాడి చేసి హంగామా సృష్టించింది. ఆదివారం రాత్రి నుంచి అఘోరి వివాదం తెలుసుకున్న స్థానిక పోలీసులు అడుగడుగునా ఆమెని అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు.