బెంగుళూరు వధువు 'జీరో వేస్ట్ వివాహాం'.. ప్రశంసలు కురిపించిన నెటిజన్స్

బెంగుళూరు వధువు తన జీరో-వేస్ట్ వివాహాన్ని "మదర్ ఎర్త్‌తో జరుపుకుంది" అని డాక్యుమెంట్ చేసింది.;

Update: 2024-06-07 09:37 GMT

బెంగుళూరు వధువు తన "జీరో-వేస్ట్ వెడ్డింగ్"తో ఇంటర్నెట్‌లో ప్రశంసలు పొందింది. ఆమె తన తల్లి సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టగలిగానని పేర్కొంది. వీడియోలో, డాక్టర్ పూర్వీ భట్ తన పెళ్లికి సంబంధించిన స్నిప్పెట్‌లను డాక్యుమెంట్ చేసింది: "మా కుటుంబాల సహకారం వల్లనే జీరో-వేస్ట్ వెడ్డింగ్ అనే నా కల సాధ్యమైంది" అని పేర్కొంది. 

అరటి ఆకుల్లో భోజనం, మండపాన్ని చెరకుతో తయారు చేయడం, వేదికను మామిడి, కొబ్బరి ఆకులతో అలంకరించడం ఈ వేడుకలో ముఖ్యమైనవి. ఈ జంట వివాహ దండలు కూడా పువ్వులు, పత్తి దారాలతో తయారు చేసినవి.

వీడియోలో, డాక్టర్ భట్ ఇలా విశదీకరించారు: “నా పెళ్లి జీరో-వేస్ట్. మేము దీన్ని ఎలా చేశామో వివరిస్తాను. మా మంటపం చెరకుతో తయారు చేయబడింది, వేడుక తర్వాత మేము దీనికి ఉపయోగించిన చెరకును మా ఆవులకు తినిపించాము. అరటి ఆకుల్లో భోజనం,  స్టెయిన్‌లెస్ స్టీల్ గ్లాసులలో మంచి నీరు అందించాము. 

“ వ్యర్థాలన్నీ ఈవెంట్ తర్వాత మా పొలంలో కంపోస్ట్ చేయబడ్డాయి. మేము మా బహుమతులను జనపనార సంచులలో ఇచ్చాము. మా హ్యాండ్ వాష్  నీటిని చెట్లకు మళ్లించాము. 

జీరో వేస్ట్ వివాహాన్ని అమలు చేసినందుకు ఆమె తన తల్లిని కూడా అభినందించింది. "నా తల్లి దీని వెనుక ఉన్న మేధావి, ఆమె మొత్తం ఈవెంట్‌ను ప్లాన్ చేసి నిర్వహించింది. ఈ విధంగా వివాహం చేసుకోవడం నాకు చాలా సంతృప్తిగా ఉంది."

డాక్టర్ భట్ యొక్క వీడియో 7 మిలియన్లకు పైగా వీక్షణలతో వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు డాక్టర్ భట్ ని ప్రశంసించారు.

వీడియో ముగించే ముందు డాక్టర్ భట్ ఇలా అన్నారు: “మీకు ఈ వెడ్డింగ్ ప్లాన్ కి పెద్ద బడ్జెట్ అవసరం లేదు. మీకు ఆలోచన వస్తే చాలు అది ఆచరణ సాధ్యం అవుతుంది అని తెలిపింది. 

Tags:    

Similar News