Madhupriya : వివాదంలో మధుప్రియ.. కాళేశ్వరం గర్భగుడిలో సాంగ్ షూట్

Update: 2025-01-21 12:45 GMT

కాళేశ్వరం ఆలయ నిబంధనలకు, ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా గర్భగుడిలో పాటను షూట్‌ చేశారు. ఆలయం గర్భగుడి ముందు ప్రైవేట్ పాటను చిత్రీకరించారు. సుమారు అరగంట పాటు ఆలయ తలుపులు మూసి పాట చిత్రీకరించారు. శివుని పై తీస్తున్న పాటను గాయని మధుప్రియ పాడుతూ షూటింగ్ చేశారు. ఎంతో ప్రాచుర్యం, విశ్వాసం కలిగిన ఈ ఆలయంలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించివద్దని దేవాదాయశాఖ నిబంధనలు ఉన్నాయి. గర్భగుడిలో ఏవైనా చిత్రీకరించినప్పుడు దేవదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సింది ఉండగా, స్థానిక అధికారులు మాత్రం తమ స్వలాభార్జన కోసం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News