సంగీత దర్శకుడు రెహమాన్ నుంచి తానింకా విడాకులు తీసుకోలేదని సైరా బాను ఓ ప్రకటనలో తెలిపారు. తనను అప్పుడే మాజీ భార్యగా పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. ‘నా అనారోగ్య సమస్యల కారణంగా మేం విడిపోయాం తప్ప ఇంకా విడాకులు తీసుకోలేదు. ఈరోజు ఆస్పత్రిపాలైన ఆయన వేగంగా కోలుకోవాలి’ అని ఆకాంక్షించారు. ఈ దంపతులకు 1995లో పెళ్లైంది. ముగ్గురు పిల్లలున్నారు. తాము విడిపోతున్నట్లు గత ఏడాది నవంబరులో బాను ప్రకటించారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. ‘డీహైడ్రేషన్ కారణంగా నాన్నగారు కొంచెం బలహీనంగా అనిపించారు. అందుకే ఆస్పత్రిలో రొటీన్ టెస్టులు చేయించాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారని తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. రెహమాన్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.