Viral Video: ట్రాక్‌పై వృద్ధుడు.. అదే పట్టాలపై వస్తున్న రైలు.. కళ్ళ ముందే
ఓ వృద్ధుడు రైలు పట్టాపై నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో ముంబై- వారణాసి రైలు అదే పట్టాలపై వస్తుంది.;
Image Source : Ani Twitter
Viral Video: ట్రైన్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పింది. రైలు రాకని గమనించని ఓ వృద్ధుడు ట్రాక్ దాటుతుండగా కిందపడిపోయాడు. ఇది గమనించిన ట్రైన్ పైలెట్ వెంటనే అత్యవసర బ్రేకులు ఉపయోగించి ట్రైన్ నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముంబైలోని కల్యాణ్ ప్రాంతంలోని రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ముంబై-వారణాసి రైలు స్టేషన్ వద్దకు సమీపిస్తున్నా సమయంలో ఓ వృద్ధుడు రైలు పట్టాపై నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో ముంబై- వారణాసి రైలు అదే పట్టాలపై వస్తుంది.
వృద్ధుడు రైలు పట్టాపై నడుస్తున్న విషయం గమనించిన రైల్వే అధికారి, రైలు డ్రైవర్లు అప్రమత్తం అయ్యారు. దీంతో డ్రైవర్లు రైలులోని ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దాంతో వృద్ధుడు రైలు బోగి ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. రైలు డ్రైవర్ల సమయస్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైలెట్ సరైన సమయంలో స్పందించపోయివుంటే ఆ పెద్దయాన ప్రాణాలు పోయివుండేవని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Rajendra Prasad: 'నటకిరీటి'.. నవ్వించగలడు.. ఏడిపించగలడు.. 'రాజేంద్రుడి' పుట్టినరోజు స్పెషల్