Groom Variety Entry: పెళ్లికొడుకు వెరైటీ ఎంట్రీ.. వీడియో వైరల్..
Groom Variety Entry: ఈమధ్య పెళ్లిళ్లు అనేవి చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి.
Groom Variety Entry (tv5news.in)
Groom Variety Entry: ఈమధ్య పెళ్లిళ్లు అనేవి చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఒకప్పటి లాగా సింపుల్‌గా చూసుకోవడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. ఎంట్రీ నుండి ఎండింగ్ వరకు అన్నీ స్పెషల్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఎంట్రీని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను మనం రోజు సోషల్ మీడియాల్లో చూస్తునే ఉంటాం. అయితే తాజాగా ఒక పెళ్లికొడుకు తన పెళ్లికి వెరైటీగా ఎంట్రీ ఇచ్చాడు.
దినేష్ సేల్ అనే ఓ హైదరాబాద్ కుర్రాడికి ఇక్కడ హ్యాపీ హైదరాబాద్ అనే ఓ సైక్లింగ్ కమ్యునిటీ ఉంది. అతడు తన పెళ్లిని చాలా స్పెషల్‌గా ప్లాన్ చేసుకున్నాడు. ఎంట్రీ డిఫరెంట్‌గా ఉండాలన్న ఉద్దేశ్యంతో మండపానికి సైకిల్‌పైనే వెళ్లాడు. దారిలో చాలామంది తనను చాలా వింతంగా చూశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినవారు కూడా ఏంటో ఈ వెరైటీ ఎంట్రీ అనుకుంటున్నారు.
దీని గురించి దినేష్ మాట్లాడుతూ.. బైక్, కార్ లాంటి వాటికంటే సైకాలే ప్రయాణించడానికి మేలు అని అన్నాడు. అంతే కాకుండా తాను ఒక డిఫరెంట్, కూల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు కాబట్టే సైకిల్‌పై వచ్చానని తెలిపాడు. ఇక వారి పెళ్లికి కూడా తన సైకిల్ కమ్యునిటీ స్నేహితులు ఒక సైకిల్‌నే బహుమతిగా ఇచ్చారు. అంతే కాక బరాత్‌ను కూడా సైకిల్ పైనే చేశారు.