Chittoor : చిత్తూరులో ఏనుగుల గుంపు హల్ చల్

Update: 2025-08-07 13:32 GMT

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం ..పులిచెర్ల మండలం లోని తూర్పు అటవీ సరిహద్దు ప్రాంతాలలో 15 ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తున్నాయి. పాకాల మండల సరిహద్దు ప్రాంతంలో మామిడి చెట్లు, టమాట పంటలు, కొబ్బరి చెట్లు ద్వసం చేశాయి, పులిచెర్ల మండలం, పాళెం పంచాయతీ సమీపంలో చింతలవంక వద్ద 15 ఏనుగులు తిష్ట వేసినట్లు అటవీ అధికారుల సూచనలు. ఒంటరి మదపుటేనుగు పంటపొలాల పై పడి ద్వంసం చేస్తుంది. పాకాల మండలం, పులిచెర్ల సరిహద్దు ప్రాంతాలైన రాయవారి పాళెం సుధాకర్ నాయుడు, దినకర నాయుడు, ఉపతపుచెరువుకు చెందిన కృష్ణమ నాయుడు మామిడి, టమాటా పంటలు సుమారు రెండుమూడు ఎకరాలు ద్వంసం అయింది. పులిచెర్ల మండలం, పాళెం, దేవళంపేట, కల్లూరు, కమ్మపల్లి పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Tags:    

Similar News