Train Incident : కదులుతున్న రైలులో పిల్లల స్టంట్స్

Update: 2024-10-16 11:00 GMT

కదులుతున్న ఎంఎంటీఎస్ రైలులో చిన్న పిల్లలు ప్రమాదకరంగా స్టంట్‌లు చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం చిన్న పిల్లలు స్టేషన్ వద్దకు వచ్చిన ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి నిలుచున్నారు. రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో కిందికి దిగి, ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ఉపయోగించే హ్యాండిల్ సపోర్టర్ సహాయంతో రైలు వెంట పరిగెడుతూ స్టంట్‌లు చేశారు. మధ్యమధ్యలో రైలు ఎక్కి దిగుతూ ప్రమాదకరమైన ఫీట్లు చేశారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Tags:    

Similar News