Jharkhand : అడవిలో రూ.35లక్షలు.. భద్రతాసిబ్బంది తనిఖీల్లో..

Update: 2025-07-28 14:00 GMT

అడవిలో లక్షల డబ్బు దొరకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఝార్ఖండ్‌లోని ఓ అడవిలో భద్రతా సిబ్బంది భారీగా నగదు గుర్తించారు. సింగ్‌భమ్‌ జిల్లాలోని నక్సల్‌ ప్రభావిత కారైకేలా ప్రాంతంలో బంకర్‌లాంటి ఓ నిర్మాణం ఉంది. అందులో రూ.35లక్షలు డబ్బు దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల కోసం సీఆర్‌పీఎఫ్, ఝార్ఖండ్‌ జాగ్వార్, జిల్లా సాయుధ పోలీసులు సారండా అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ చేపట్టారు. అయితే వారికి ఓ బంకర్‌ కనించింది. దాన్ని తవ్వి చూడగా రెండు స్టీల్‌ డబ్బాల్లో రూ.34.99 లక్షల నగదు ఉండడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ మొత్తాన్ని సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిని మావోయిస్టులు దాచి ఉంటారని అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News