The Yamazaki: వేలంపాటలో విస్కీ బాటిల్.. ఏకంగా రూ.4.14 కోట్లతో..
The Yamazaki: సుంటోరీ లిక్కర్ తయారీ సంస్థ తయారు చేసిన ది యమజాకీ 55 ఇయర్స్ ఓల్డ్ విస్కీని ఇటీవల వేలంపాటలో పెట్టారు.;
The Yamazaki (tv5news.in)
The Yamazaki:మామూలుగా ఏదైనా పురాతన వస్తువులను, లేదా సెలబ్రిటీలకు ఇష్టమైన వస్తువులను వేలంపాట వేయడం.. ఆ వేలంపాటలో ఎంతోమంది పాల్గొని తమకు ఇష్టమైన వస్తువును ఎంత ధర అయినా పెట్టి కొనడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే మద్యం ఇష్టపడే వారికి కూడా వేలంపాటలు ఉంటాయి. చాలా అరుదుగా దొరికే కొన్ని బ్రాండ్స్‌కు వేలంపాటలు జరుగుతుంటాయి. ఇటీవల అలాంటి ఒక వేలంపాటలో ఓ విస్కీ బాటిల్ ఏకంగా రూ. 4.14 కోట్లు వేలం పలికింది.
మత్తు కోసమే మద్యం.. కానీ అందులో కూడా ఆరోగ్యాన్ని వెతుక్కునే వారు ఉంటారు. బ్రాండ్ వైన్ తాగితే కాస్త ఆరోగ్యానికి తక్కువ నష్టం కలిగిస్తుంది అనుకుంటారు కొంతమంది. లేదు ఖరీదైన విస్కీ తాగితే ఆరోగ్యానికి అంత చెడు జరగదు అనుకుంటారు మరికొందరు. అందుకే చాలామంది హై క్లాస్ వారు ఖరీదైన మద్యానికే ఓటేస్తారు. అలాంటి ఓ వ్యక్తి ఒక అరుదైన విస్కీని ఏకంగా రూ. 4.14 కోట్లు పెట్టి కొన్నాడు. మరి దీనికి అంత విలువ ఎందుకంటారా..
జపాన్‌కి చెందిన సుంటోరీ లిక్కర్ తయారీ సంస్థ తయారు చేసిన ది యమజాకీ 55 ఇయర్స్ ఓల్డ్ విస్కీని ఇటీవల వేలంపాటలో పెట్టారు. మొత్తం ఎనిమిదిమంది ఈ అరుదైన విస్కీని సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు చైనాకు చెందిన ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో 4,88,000 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.4.14 కోట్లు చెల్లించి ఈ విస్కీని దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
సుంటోరీ లిక్కర్ సంస్థ.. ఈ ది యమజాకీ విస్కీని ప్రత్యేకంగా తయారు చేస్తుంది. 1960లో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి యమజాకీ స్కాచ్‌కి ప్రాణం పోశారు. ఈ సంస్థ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి లిమిటెడ్‌గా మార్కెట్‌లోకి తెస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే వాటిని సరఫరా చేస్తూ ఉంటుంది. 2020లో కేవలం వంద విస్కీ బాటిల్స్‌ని మాత్రమే మార్కెట్‌లో రిలీజ్ చేసింది సుంటోరీ.