Palamaner: యూకేజీ బాలుడి పోలీస్ కంప్లెయింట్.. ఇంతకీ ఎవరిపై..?
Palamaner: ఆంధ్రప్రదేశ్‌లోని పలమనేరు సర్కి్ల్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు కార్తిక్.;
Palamaner: సామాజిక సమస్యలపై స్పందించాలంటే వయసుతో సంబంధం లేదు. అర్థం చేసుకుని మనసు ఉంటే చాలు. కొన్ని విషయాల్లో మార్పు తీసుకురావడానికి ఏజ్ లిమిట్ ఏమీ ఉండదు. సామాజిక పరిస్థితులు అర్థమయిన ఎవరైనా పోలీసులను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదు చేయవచ్చు. ఇదే స్వేచ్ఛతో ఆరేళ్ల బాలుడు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్లాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలమనేరు సర్కి్ల్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు కార్తిక్. అయితే స్కూలు ముందు తవ్వకాలు జరపడం వల్ల అక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుందని పోలీసులకు కంప్లెయింట్ చేయడానికి వెళ్లాడు. పోలీసులు కార్తిక్ ఆరోపణలు విన్న తర్వాత కంప్లెయింట్ తీసుకున్నారు కూడా. స్కూలు ముందు డ్రైనేజీ పనులు జరుగుతుండడం వల్ల అలా తవ్వకాలు జరిపారని వారు తెలిపారు.
పలమనేరు సీఐ కార్తిక్ ఆత్మస్థైర్యానికి మెచ్చి తనకు చాక్లెట్లు ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి పంపించారు. అంతే కాకుండా తన కంప్లెయింట్‌పై యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ మధ్య పిల్లలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లెయింట్ ఇస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ బాలుడు.. తన ఫ్రెండ్ తన పెన్సిల్‌ను కొట్టేశాడని అరెస్ట్ చేయమని పోలీసులను ఆశ్రయించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేసింది.
#AndhraPradesh: A 6-year-old UKG student Karthikeya of #Palamaner in #Chittoordistrict complaints to the police, on traffic issues near his school. He asked the police to visit the school and solve the problem.@NewsMeter_In @CoreenaSuares2 @ChittoorPolice @APPOLICE100 pic.twitter.com/RxiJpSYzY0
— SriLakshmi Muttevi (@SriLakshmi_10) March 19, 2022