టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకుల అంశంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ ఈ విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నప్పటికీ వారి అభిమానులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు అనేది వాస్తవం. నాగ చైతన్య శోభిత ను పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశాడు. అటు సమంత ఒంటరిగా ఉంటూ తన లైఫ్ లో బీజీగా ఉంది. అయితే వీరి విడాకులకు అసలు కారణం ఏంటి అనేది ఇప్పటికీ వెల్లడి కాలేదు. తాజాగా, నాగచైతన్యకు సోషల్ మీడియాలో ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.
హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు ఇటీవలే తల్లి తండ్రులు అయిన సంగతి తెలిసిందే. వారికి సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ కామెంట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ, "సమంతకు ఎందుకు విడాకులు ఇచ్చావు? అసలు కారణం ఏమిటి?" అంటూ నేరుగా ప్రశ్నించాడు. కాగా ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.