Woman Fights Off Leopard : మీరు సూపర్ ఆంటీ.. చేతికర్రతో చిరుతని.. వీడియో వైరల్

Woman Fights Off Leopard : ఆంటీకి సపోర్ట్ ఆ చేతి కర్ర. ఆపదలో అదే ఆయుధమైంది. అమాంతంగా దాడి చేసిన చిరుతని చూసి అరిచి గీ పెట్టలేదు..

Update: 2021-09-30 09:30 GMT

Woman Fights Off Leopard :ఆంటీకి సపోర్ట్ ఆ చేతి కర్ర. ఆపదలో అదే ఆయుధమైంది. అమాంతంగా దాడి చేసిన చిరుతని చూసి అరిచి గీ పెట్టలేదు.. తన చేతి కర్రనే తీసుకుని తరిమింది.. అదృష్టం బావుండి ఆమె ప్రాణాలతో బయటపడింది. ముంబయి ఆరే ప్రాంతంలో చిరుతలు స్వైర విహారం చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో చిరుత జనవాసంలోకి ప్రవేశించడం ఇది రెండోసారి. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో చిరుత మహిళ మీద దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి.

55 సంవత్సరాల వయసున్న నిర్మలా దేవి సింగ్ అనే మహిళ ఇంటి ఆవరణలోని గట్టు మీద కూర్చుంది. ఇంట్లో నుంచి నిదానంగా చేతి కర్ర ఆధారంతో నడుచుకుంటూ వచ్చి గట్టు మీద కూర్చుంది. ఇంతలో అప్పటికే అక్కడ ఉన్న చిరుత ఆమెపై దాడి చేసింది. ఈ హఠాత్ పరిణామానికి ఆమె ఒకింత భయపడ్డా.. తమాయించుకుని తన దగ్గర ఉన్న చేతి కర్రతో అదిలించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె వెనక్కి పడిపోయింది. అయినా అదే ధైర్యంతో చిరుతని చేతికర్రతో అదిలించింది. ఈ క్రమంలో ఆమె అరుపులకు ఇంట్లో వాళ్లు బయటకు వచ్చారు. చిరుత దాడి చేసిన విషయం తెలుసుకుని ఆమె సురక్షితంగా బయటపడిందని ఊపిరిపీల్చుకున్నారు. చిరుత మహిళపై దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండు రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడికి పాల్పడింది. ఓ చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా వచ్చిన చిరుత దాడిచేసి గాయపరిచే ప్రయత్నం చేసింది. కానీ వెంటనే గమనించిన స్థానికులు కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ముంబై నగరంలో దట్టమైన పొదలు, చెట్లు ఉండే ఏకైక ప్రాంతం ఆరే. ఇక్కడ పలు రకాల జంతువులు, పక్షులు ఆవాసం ఉంటాయి. 

Tags:    

Similar News