ఉక్రెయిన్‌లో ఘోర విమానం ప్రమాదం.. 25 మంది మృతి
ఉక్రెయిన్‌లో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి మిలటరీ విమానం కుప్పకూలి 25 మంది మరణించారు.;
ఉక్రెయిన్‌లో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి మిలటరీ విమానం కుప్పకూలి 25 మంది మరణించారు. ఉక్రెయిన్ ఖర్‌కివ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని.. ఇంజన్ ఫెయిల్ అవ్వడమే దీనికి కారణమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. గాయాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని. అయితే, వారి పరిస్తితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాద సమయంలో 28 మంది ఉన్నారని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.