అనన్య బిర్లాకు అవమానం.. రెస్టారెంట్లో 3 గంటలు..
బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కూతురైన అనన్య బిర్లా గాయనిగా
ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క బిలియనీర్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా, జాత్యహంకారమని ఆరోపిస్తూ యుఎస్ రెస్టారెంట్‌ను నిందించారు. కాలిఫోర్నియాలోని ఇటాలియన్-అమెరికన్ రెస్టారెంట్ ఆమెను, ఆమె కుటుంబాన్నిఅవమానానికి గురిచేసిందని పేర్కొంది.
కాగా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కూతురైన అనన్య బిర్లా గాయనిగా, ఆర్టిస్టుగా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్నారు. స్కోపా రెస్టారెంట్‌ది జాత్యహంకారం. చాల బాధాకరం. మీరు మీ కస్టమర్లతో సరిగ్గా వ్యవహరించాలి అని అనన్య బిర్లా ట్వీట్ చేశారు. స్కోపా ఇటాలియన్ మూలాలున్న రెస్టారెంట్. కాలిఫోర్నియాలో చెఫ్ ఆంటోనియా లోఫాసో నిర్వహిస్తున్న ఇటాలియన్-అమెరికన్ హోటల్.
"మేము మీ రెస్టారెంట్లో ఆర్డర్ చేసిన ఫుడ్ కోసం 3 గంటలు వేచి ఉన్నాము. మీ వెయిటర్ సిల్వర్మాన్ నా తల్లితో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది సరైంది కాదు, "అని అనన్య మరొక ట్వీట్లో లోఫాసోను ట్యాగ్ చేసింది. అనన్య తల్లి, మరియు విద్యావేత్త నీర్జా బిర్లా కూడా రెస్టారెంట్ నిర్వాహకులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. కస్టమర్లతో ఇలా వ్యవహరించే హక్కు మీకు లేదు "అని అనన్య బిర్లా తల్లి నీరజా బిర్లా ట్వీట్ చేశారు.
We waited for 3 hours to eat at your restaurant. @chefantonia Your waiter Joshua Silverman was extremely rude to my mother, bordering racist. This isn't okay.
— Ananya Birla (@ananya_birla) October 24, 2020