అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దీనిలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటాహ్ రాష్ట్రంలో ఉన్న ట్రెంబోటన్ నగరంలో ఒక domestic disturbance (కుటుంబ వివాదానికి సంబంధించిన) కాల్‌కు స్పందించి అక్కడికి వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారులపై నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సార్జెంట్ లీ సోరెన్సన్ (56) మరియు ఆఫీసర్ ఎరిక్ ఎస్ట్రాడా (31) మరణించారు. సార్జెంట్ సోరెన్సన్ 17 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ఇటీవల పదోన్నతి పొందారు. మొదటిగా ఒక అధికారి ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు, నిందితుడు బయటకు వచ్చి ఆ అధికారిపై కాల్పులు జరిపాడు, దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన మరో అధికారిపైనా నిందితుడు కాల్పులు జరపడంతో, ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల తర్వాత, సంఘటనా స్థలంలో ఉన్న ప్రజలు నిందితుడిని లొంగిపోవాలని ఒప్పించారు. దాంతో అతను తన ఆయుధాన్ని కింద పడేశాడు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాద ఘటన పట్ల ఉటాహ్ గవర్నర్ స్పెన్సర్ కాక్స్ సంతాపం తెలిపారు. మరణించిన పోలీసుల గౌరవార్థం జాతీయ జెండాలను సగం వరకు దించాలని ఆదేశించారు. ఇటీవల న్యూయార్క్ నగరంలో జరిగిన మరో కాల్పుల ఘటనలోనూ ఒక పోలీసు అధికారి మరణించారు. గత నెలలో మాన్‌హాటన్‌లోని ఒక భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మృతులలో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు.