వ్యాక్సిన్ పనితీరు డిసెంబర్ నాటికి తెలిసిపోతుంది: ఆస్టాజెనెకా

ఆస్టాజెనెకా వ్యాక్సిన్ కరోనా నుంచి ప్రజలను రక్షిస్తుందో లేదో ఈ ఏడాది చివరి నాటికి తెలుస్తుందని ఆ సంస్థ చీఫ్

Update: 2020-09-10 14:44 GMT

ఆస్టాజెనెకా వ్యాక్సిన్ కరోనా నుంచి ప్రజలను రక్షిస్తుందో లేదో ఈ ఏడాది చివరి నాటికి తెలుస్తుందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కల్ సోరియోట్ గురువారం తెలిపారు. ఈ టీకాపై బ్రిటన్‌లో జరుగుతున్న ట్రయల్స్‌లో ప్రతికూలత ఎదురైన సంగతి తెలిసిందే. ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లలో ఒకరికి వెన్నెముకలో వాపు సమస్య ఏర్పడడంతో ట్రయల్స్ నిలిపివేశారు. ఆ వలంటీర్‌కు ఇంకా రోగ నిర్ధారణ కాలేదని, వెన్నెముకలో వాపు ఉన్నదీ, లేనిదీ తెలియరాలేదని అన్నారు. ఈ వ్యాక్సిన్ గురించి గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ఆశాజనమైన వ్యాక్సిన్‌గా కితాబిచ్చిందని సోరియోట్ గుర్తు చేశారు. ట్రయల్స్ నిలిచిపోవడంసాధారణమైన విషయమేనని అన్నారు.

Tags:    

Similar News