America : అమెరికాలో బోధన్ విద్యార్థి దుర్మరణం

Update: 2024-12-21 16:30 GMT

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం లోని గౌడ్స్ కాలనీకి చెందిన పంజాలు నీరజ్ గౌడ్ (23) అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఘటనలో జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన శ్రీధర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడాది క్రితం వీరిద్దరూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి న్యూహెవెన్ సిటీలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. ఈ నెల 16న బ్రిడ్జిపోర్టు ప్రాంతానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా తీవ్రంగా మంచు కురుస్తుండడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పోలీసు పెట్రోలింగ్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన నీరజ్ గౌడ్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. శ్రీధర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అమెరికా పెట్రోలింగ్ పోలీసు కారులోని సిబ్బందికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదు నిమిషాల్లో వీరు నివాసం ఉండే గదికి చేరుకునే సమీపంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోధనకు చెందిన పంజాల నీరజ్ గౌడ్ తండ్రి శంకర్ గౌడ్ నెమ్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మృతదేహన్ని స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News