రాముడు రావణుడిపై విజయం సాధించినట్లే.. మనం కోవిడ్‌పై గెలుస్తాం - బోరిస్ జాన్సన్
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రిన్స్ చార్లెస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే..;
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రిన్స్ చార్లెస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండుగ.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అధిగమించడాన్ని ప్రతిబింబిస్తోందని గుర్తుచేశారు. రాముడు రాక్షసుడైన రావణుడిని ఓడించినట్లు.. చీకటిపై వెలుతురు విజయం సాధించినట్లు.. చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం గెలిచినట్లే మనం కొవిడ్‌పై విజయం సాధిస్తామనే పూర్తి విశ్వాసం తనకుందని బోరిస్ జాన్సన్ అన్నారు..
మరోవైపు ప్రిన్స్ చార్లెస్ సైతం దీపావళి విశిష్టతకు కరోనాపై పోరుకు ముడిపెడుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ ఆనందంగా గడపాల్సిన ఈ సమయాన్ని ఆంక్షల మధ్య జరుపుకోవాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. ఇది నిరాశకు గురిచేసే అంశమైనప్పటికీ.. పండుగ అందించే సందేశంతో స్ఫూర్తి పొందాలన్నారు.