Canada Prime Minister : కుర్చీ తీసుకెళ్లిన కెనడా ప్రధాని ట్రూడో.. వీడియో వైరల్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నెటిజన్లను ఆకర్షించారు. ఆయనకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశం నెట్టింట వైరల్ అయింది. పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన విచిత్రంగా ప్రవర్తించారు. కుర్చీ చేత పట్టుకుని, నాలుకను బైటపెట్టి మీడియాకు ఫోజి చ్చారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఏంజరిగిందంటే.. కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో అధికార మార్పిడిలో భాగం గా కార్నీతో ట్రూడో భేటీ అయ్యారు. తదుపరి ప్రక్రియ సజావుగా, త్వరగా పూర్తవుతుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో పార్ల మెంట్ భవ నం నుంచి బయటకొస్తూ, తన కుర్చీని చేతబట్టుకుని వచ్చారు. మీడియావైపు చూస్తూ నాలుక బైటపెట్టి కమెడియన్ స్టయిల్లో ఫోజిచ్చారు. ఈ దృశ్యాలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఏంటి? ఈ సర్కస్ అని కొందరు వ్యాఖ్యానించగా, ట్రూడో సాధారణ జీవితంలోకి వెళ్లిపోతున్నారంటూ మరికొందరు కామెంట్ చేశారు.