China : కరోనా ఎఫెక్ట్ .. పిల్లులను చంపేస్తున్న చైనా.. !
China : కరోనాకి పుట్టినిల్లు అయిన చైనాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.;
China : కరోనాకి పుట్టినిల్లు అయిన చైనాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో నార్త్ చైనా లోని హర్బిన్ లో కరోనా బారిన పడిన రెండు పిల్లులను చంపేశారు. కరోనా సోకిన జంతువులకి చికిత్స లేకపోవడంతో ఇలాంటి చర్యలు తీసుకున్నామని అధికారులు అంటున్నారు. జంతువుల నుండి యజమానులకి కరోనా సోకకుండా చూసేందుకు కరోనా సోకిన జంతువులను చంపేస్తున్నామని చెబుతున్నారు. అటు చైనాలో ఒకరిద్దరికి పాజిటివ్‌గా అని తేలిన.. వేల మందికి పరీక్షలు చేస్తోంది ప్రభుత్వం. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో కూడా లాక్ డౌన్ విధిస్తోంది. ఆ ప్రాంతంలో వీలైనంత మందికి కొవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియని మరింత వేగవంతం చేస్తోంది. కాగా ఇప్పటివరకు చైనాలో 2.16 బిలియన్ డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేశామని ఎన్‌హెచ్‌సీ ప్రతినిధి మీ ఫెంగ్ వెల్లడించారు.