2డీ రాకెట్ తో చైనా కొత్త రికార్డు
స్పేస్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన చైనా;
లాంగ్ మార్చ్ 2డీ రాకెట్ తో చైనా కొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే మిషన్‌లో నలభై యొక్క అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి తన పాత రికార్డ్ ను తానే బ్రేక్ చేసుకుంది. షాంగ్జి ప్రావిన్సులో ఉన్న తైయువన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. చైనా చేపట్టిన లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్‌లో ఇది 476వ ఫ్లయిట్ మిషన్. ఆ శాటిలైట్లు 36 జిలిన్-1 సిరీస్‌కు చెందినవి. గురువారం నాటి ప్రయోగంతో ఇప్పటి వరకు చైనా మొత్తం 108 జిలిన్-1 శాలిలైట్లను ప్రయోగించినట్లు జిన్హువా అనే చైనా వార్త సంస్థ తెలిపింది. దీంతో 100 కంటే అధిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలతో కూడిన మొదటి వాణిజ్య కూటమిగా చైనా అవతరించింది.
తొలిసారి జిలిన్-1 శాటిలైట్‌ను 2015లో చైనా ప్రయోగించింది. ఆ శాటిలైట్ బరువు సుమారు 420 కేజీలు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ శాటిలైట్ల బరువు కేవలం 22 కిలోలు మాత్రమే. 2030 నాటికి చంద్రునికి, భూమికి మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేందుకు పనిచేసే రిలే శాటిలైట్స్‌ను రూపొందించేందుకు చైనా కృషి చేస్తోంది. చంద్రునిపై పరిశోధనలు చేపట్టడానికి తమ వ్యోమగాములను ముగ్గురిని చంద్రుని పైకి పంపింది చైనా.
అంతరిక్ష ప్రయోగాలను ముందుకు తీసుకు వెళ్లడానికి చైనా తన సొంత అంతరిక్ష ప్రయోగశాలలో మూడవ విడత ప్రయోగంలో భాగంగా జిమ్ హైపింగ్, జి యాంగ్ జ్యూ అనే ఇద్దరు వ్యోమగాముల తో పాటు పౌర వ్యోమగామి గుయ్ హైవ చావో అనే వ్యక్తిని వీళ్ళందర్నీ ఐదు నెలలు అక్కడ ఉంచనుంది. వీళ్లు షంజావో 16 అనే వ్యోమ నౌకను ఇన్నర్ మంగోలియా లోని జూకర్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద నుంచి పంపారు.
ఇప్పటివరకు చైనా అంతరిక్షంలోకి పంపించిన వ్యోమగాములందరూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములే, కేవలం గుయ్ మాత్రమే పౌర వ్యోమగామి అని తెలుస్తుంది. 2030 కల్లా మనిషిని చందమామ పైకి పంపించడం ఇంకా అక్కడ ప్రయోగాలు, పరిశోధనలు జరపడం అనేవి చైనా ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా చందమామ పైకి వ్యోమగాములను పంపించడం ద్వారా, ప్రయోగాలు, పరిశోధనలు జరిపి చందమామపై వాతావరణాన్ని కనుక్కుంటారు. భవిష్యత్తులో చందమామపై నివాసాలే తమ ధ్యేయమని చెబుతోంది చైనా. అంతరిక్ష రంగంలో చైనా వేగవంతమైన పురోగతి సాధించడంతో పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌తో మధ్య పోటీ నెలకొంది.