అధిక టారిఫ్స్ విధిస్తూ ప్రపంచ దేశాలు తమను దోచుకుంటున్నాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతున్నారు. అందుకే తామూ సుంకాలు పెంచామని స్పష్టం చేశారు. దీనివల్ల అమెరికాలో పరిశ్రమలు, ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ నమ్మకం. అయితే అమెరికాలో బ్లూ కాలర్ జాబ్స్ చేసేందుకు యువత సిద్ధంగా లేరు. అక్కడి కంపెనీలు చీప్ లేబర్ కోసం చూస్తాయి. విదేశీయులు లేకుండా అగ్రరాజ్యం మనుగడ కష్టం. మరి ట్రంప్ నిర్ణయం ఎటు దారితీస్తుందో చూడాలి.
టారిఫ్‌ల విషయంలో కొన్ని దేశాలు తనను బతిమాలుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘ప్లీజ్.. ప్లీజ్ సార్. మీతో ఎలాంటి డీల్‌కైనా సిద్ధం. ఇందుకోసం ఏమైనా చేస్తాం అని కొన్ని దేశాలు వెంపర్లాడుతున్నాయి. అయినా నేను అన్నీ తెలిసే టారిఫ్‌లను విధించా. వీటిని మళ్లీ పున:సమీక్షించే ఛాన్సే లేదు. సుంకాల దెబ్బకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి.
అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ ముదురుతోంది. తాజాగా అమెరికా వస్తువులపై 84% సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అంతకుముందు ఇది 34%గా ఉండేది. చైనాపై ట్రంప్ ప్రభుత్వం 104% టారిఫ్స్ విధించడంతో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.