ఉగ్రవాదుల ఏరివేత, వారి స్థావరాలపై దాడులే టార్గెట్ గా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. అయితే, ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. మొదట తాము అంత్యక్రియల్లో పాల్గొనలేదని పాక్ బుకాయించినా భారత్ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది.
ఉగ్రవాదుల అంత్యక్రియల్లో లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, లాహోర్ 11వ ఇన్‌ఫ్రాంట్రీ డివిజన్, బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్, మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ ఉన్నారు. ఈ వీడియోలు బయటకు రావడంతో పాకిస్తాన్ నోరు మెదపడానికి కూడా చాన్స్ దొరకడం లేదు.