ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరిగిన దాడిని అమెరికా మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని చెప్పారు. దీపావళి పండుగ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా ఆయన పోస్టు చేశారు. హిందువులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్.... అమెరికా అధ్యక్షుడు బైడెన్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ హిందువులను పట్టించుకోలేదని ట్రంప్ విమర్శించారు. ప్రధాని మోడీ తనకు స్నేహితుడనీ.. బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటామని ట్రంప్ తెలిపారు. కమలా హారిస్ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో భారతీయ వ్యాపారులకు నష్టం జరుగుతుందన్నారు. తాను గెలిస్తే పన్నులు, నిబంధనల్లో కొత విధిస్తానని.. అమెరికాను చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు.