అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన టారిఫ్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ టారిఫ్‌ల ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ భారత్‌తో సహా అనేక దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకం విధించారు. ఈ సుంకాలు ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం వాణిజ్య వర్గాలలో, ముఖ్యంగా ఎగుమతి ఆధారిత రంగాలలో తీవ్ర ఆందోళన కలిగించింది. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన తర్వాత, భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ.. మన సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 195.33 పాయింట్ల నష్టంతో 80,823 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ (nifty) 53 పాయింట్లు క్షీణించి 24,669 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.85 వద్ద ఉంది.