భారీ వరదలు.. 251 మంది మృతి
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి.. 251 మంది మృతి చెందారు.;
బంగ్లాదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశమంతటా వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 251 మంది మృత్యువాత పడినట్లు సర్కార్ తెలిపింది. గత జూన్ నుంచి మూడు సార్లు దేశాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో ఈ వరదల వల్ల దేశంలోని 33 జిల్లాల్లో మరణాలు సంభవించాయని బంగ్లాదేశ్ హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది.ఈ వరదలు మొత్తం 50 లక్షల మందిని ప్రభావితం చేశాయన్నారు.