నేపాల్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వానల కారనంగా ఎనిమిది జిల్లాల్లో దాదాపు 39మంది మరణిం చారు. సుమారు 11మంది గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. ఖాఠ్మాండూలో 9మంది, లలిత్పూర్లో 16 మంది, భక్తపూర్లో ఐదుగురు, కవ్రేపాలనౌ చౌక్లో ముగ్గురు, పంచతార్, ధన్ కూటాలో ఇద్దరు, ఝాపా, ధాడింగ్ లో ఒక్కొక్కరు చొప్పున మరణించి నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. 226 ఇళ్లు పూర్తిగా నీటమునిగిపోయాయని, ముంపు ప్రాంతాల్లో దాదాపు 3,000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొం టున్నారు.