Hajj Pilgrimage : హజ్‌లో ప్రతికూల పరిస్థితులు.. 98 మంది భారతీయులు మృతి

Update: 2024-06-22 08:06 GMT

ఈ ఏడాది హజ్ యాత్రలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో యాత్రికులు పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. విపరీతమైన వేడి కారణంగా వీరంతా ప్రాణాలు వదులుతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకారం.. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1000ని దాటింది.

ఎక్కువగా ఈజిప్టు దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ దేశానికి చెందిన వారు 600కి పైగా ఉన్నారు. ఇదిలా ఉంటే హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అన్ని మరణాలు కూడా సహజ కారణాల వల్లనే చోటు చేసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీకి వెళ్లినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడికి వెళ్లిన భారతీయుల కోసం చేయగలిగిందంతా చేస్తున్నామని చెప్పింది.

ఇస్లాం 5 నియమాల్లో ఒకటైన హజ్ యాత్ర కోసం యాత్రికులు సౌదీకి వెళ్తుంటారు. ఇస్లాం ప్రకారం, ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. ఐతే అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా 51.8 డిగ్రీలకు చేరుకుంది. తీర్ధయాత్ర కోసం గంటల తరబడి ఎండలో నడవడం, ప్రార్ధనలు చేయడంతో చాలా మంది అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News